fbpx
Tuesday, October 22, 2024
HomeMovie Newsతంగలాన్ OTT: డీల్ ఎందుకు మారింది?

తంగలాన్ OTT: డీల్ ఎందుకు మారింది?

WHY-THANGALAAN-OTT-DEAL-CHANGED
WHY-THANGALAAN-OTT-DEAL-CHANGED

మూవీడెస్క్: తమిళ స్టార్ హీరో విక్రమ్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన తంగలాన్ (Thangalaan) చిత్రం ఆగస్టు 15న విడుదలై మంచి స్పందన రాబట్టింది.

బ్రిటీష్‌ కాలంలో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది.

కలెక్షన్ల పరంగా విజయవంతమైనప్పటికీ, కథన పరంగా మిశ్రమ స్పందన లభించింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఓటీటీ విడుదల విషయంలో కొత్త మలుపు తీసుకుంది.

తంగలాన్‌ డిజిటల్‌ హక్కులను ముందుగా నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినప్పటికీ, అనూహ్యంగా ఆ డీల్‌ రద్దయింది.

సినిమా విడుదల అనంతరం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో, నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ కోసం ముందుకు రాలేదని టాక్‌.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, అమెజాన్‌ ప్రైమ్‌ ఈ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుని, త్వరలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం మార్పు ఇప్పుడు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular