మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా భారత్‌కి వచ్చారు. తన సతీమణితో కలిసి తాజ్ మహల్ సందర్శించిన ఆయన, ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉధ్యాయ్ స్వాగతం పలికిన ఈ పర్యటనలో, ప్రజలకు రెండు గంటల పాటు తాజ్ మహల్‌లోకి అనుమతి ఇవ్వలేదు.
అదేవిధంగా, ముయిజ్జు ప్రధాని మోడీతో భేటీ అయ్యి, భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మోడీ మాల్దీవులకు 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
భారత్ సహకారంతో హనిమధూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కొత్త రన్‌వేను వర్చువల్‌గా ప్రారంభించారు.
ముయిజ్జు, భారతీయులు మరింత ఎక్కువగా మాల్దీవులకు పర్యటించాలని కోరుతూ, మాల్దీవుల టూరిజంలో వారి పాత్రను ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆయనకు అందించిన ఆతిథ్యానికి మోడీ, ద్రౌపది ముర్మూలకు కృతజ్ఞతలు తెలిపారు.