న్యూఢిల్లీ: రఫేల్, ఈ పేరు ఇప్పుడు దాదాపు ప్రతి భారతీయుడు వింటున్న పేరు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు.
కశ్మీర్‌కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి భారత్ కు వస్తున్న తొలి బ్యాచ్ లోని రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు తగినట్టుగా ఈ రఫేల్‌ను మార్చే ప్రక్రియలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారు.
భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్‌ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర హిలాల్ అహ్మద్ రాథొడ్ పేరిట ఉంది.
ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా కూడా ఘనత సాధించారు. హిలాల్ జన్మించినద్ దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో. ఆయన తండ్రి జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్. తన కెరీర్లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్‌ను హిలాల్ సాధించారు.