fbpx
Friday, October 18, 2024
HomeTelanganaకొత్త టీచర్లకు నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy will provide appointment documents to new teachers!

తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కొత్త టీచర్లు నియామక పత్రాలు నేడు అందుకోనున్నారు.

తెలంగాణ: ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నెరవేరే సమయం రానేవచ్చింది. ఈరోజు 10,006 మంది ఉపాధ్యాయులు తమ నియామక పత్రాలను అందుకోనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై, స్వయంగా కొంతమందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.

మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గానూ, ఈ నియామక ప్రక్రియలో 10,006 మంది అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల 1,056 ప్రత్యేక విద్యాధికారులు మరియు పీఈటీ పోస్టులు ఇంకా భర్తీ కావలసి ఉందని విద్యాశాఖ అధికారికంగా తెలిపింది.

ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు జరిగిన DSC పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular