fbpx
Friday, October 18, 2024
HomeNationalChampions Trophy 2025: భార‌త్ ఫైనల్ చేరితే వేదిక మార్పు?

Champions Trophy 2025: భార‌త్ ఫైనల్ చేరితే వేదిక మార్పు?

ICC-CHAMPIONS-TROPHY-2025-FINAL-VENUE-CHANGE-IF-INDIA-ENTERS-FINAL
ICC-CHAMPIONS-TROPHY-2025-FINAL-VENUE-CHANGE-IF-INDIA-ENTERS-FINAL

దుబాయ్: 2025 లో జరగనున్న ఐసీసీ Champions Trophy 2025 కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, బీసీసీఐ మాత్రం భారత జట్టును పాకిస్థాన్‌కి పంపడానికి మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికలో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది.

అదే సమయంలో, పాకిస్థాన్ కూడా తమ దేశంలోనే మ్యాచ్‌లు నిర్వహించాల్సిందేనని పట్టుదలగా ఉంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దశాబ్దకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం లేదు.

ప్రస్తుతం ఈ రెండు జట్లు అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి, అది కూడా తటస్థ వేదికలపై.

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వచ్చి మ్యాచ్‌లు ఆడింది.

చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఇప్పటికే టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

ఈ షెడ్యూల్ ప్రకారం, ఫైనల్ మ్యాచ్‌ను లాహోర్‌లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.

అయితే, ‘టెలిగ్రాఫ్’ పత్రిక నివేదిక ప్రకారం, భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఫైనల్‌ వేదికను దుబాయ్‌కి మార్చే అవకాశముందని తెలుస్తోంది.

భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే, టీమిండియా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

మరోవైపు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం టోర్నమెంట్ మొత్తం పాకిస్థాన్‌లోనే జరుగుతుందని స్పష్టం చేస్తోంది.

2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తామని, భారతదేశంతో సహా అన్ని జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నమ్మకం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలుగా ఎంపిక చేసినట్లు పీసీబీ వెల్లడించింది.

ఈ స్టేడియాల్లో మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, చివరి మెరుగులు దిద్దుతున్నామని నఖ్వీ తెలిపారు.

లాహోర్‌లో నఖ్వీ మాట్లాడుతూ, భారత్‌ పాకిస్థాన్ పర్యటనపై కొనసాగుతున్న అనిశ్చితిని ప్రస్తావించారు.

2008 జులై నుంచి భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదని, ఇరు దేశాల మధ్య రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణమని వివరించారు.

“భారత జట్టు పాకిస్థాన్‌కి రావాలని కోరుకుంటున్నాం. వారు ఇక్కడికి రావడం తప్పక జరుగుతుందని ఆశిస్తున్నాము.

పాకిస్థాన్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లను మేము ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాం,” అని అన్నారు.

టోర్నీ షెడ్యూల్ సమయానికి అన్ని స్టేడియాలు సిద్ధంగా ఉంటాయని, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అవసరమైన మరమ్మతులు పూర్తవుతాయని నఖ్వీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular