హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహలు అంచనాలకు భిన్నంగా ఫలితాల వైపుకు మళ్లాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆశించినా, బీజేపీ మూడోసారి విజయాన్ని అందుకుంది. దీనికి ప్రధాన కారణంగా బహుజన సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతిని పేర్కొంటున్నారు.
మాయావతి సైలెంట్‌గా కాంగ్రెస్ వ్యతిరేక ఓటును చీల్చడంతో, కాంగ్రెస్ ఆశించిన విజయాన్ని చేజార్చుకుంది. అంతకు ముందే కాంగ్రెస్, బీఎస్పీ కూటమి ఏర్పాటుకు చర్చలు జరిపినా, మాయావతి చివరి నిమిషంలో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు.
ఆమె కాంగ్రెస్‌కు టికెట్లు దక్కని నాయకులను బీఎస్పీ తరఫున పోటీకి నిలబెట్టడం, ఎన్నికల్లో భారీగా ఓటు చీల్చడం కాంగ్రెస్‌కు చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా, మాయావతికి బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి.
ఫలితంగా, హరియాణాలో బీజేపీ విజయాన్ని సాధించడంతో కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురైంది. మాయావతితో తెరచాటు ఒప్పందం, ఆమె వ్యూహం ఎలాంటి ప్రభావం చూపిందో ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. మొత్తం మీద మాయావతి దెబ్బతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది.