మూవీడెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిత్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
డెబ్యూ మూవీ బాణంతో మంచి హిట్ అందుకున్న ఆయన, ప్రతినిధి-2తో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇప్పుడు జీవిత భాగస్వామిగా ప్రతినిధి-2 హీరోయిన్ సిరి లెళ్లను ఎంచుకున్నారు. నేడు హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది.
ఇది పూర్తిగా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య నిర్వహించారని సమాచారం.
నారా చంద్రబాబు, భువనేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. భువనేశ్వరి స్వయంగా ఈ వివాహ సంబంధాన్ని కుదుర్చారని, ఆమెనే మొత్తం వేడుక పర్యవేక్షించారని తెలుస్తోంది.
వివాహ తేదీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. డిసెంబర్‌లో పెళ్లి వేడుకను భారీ స్థాయిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని అంచనా.
ప్రస్తుతం రోహిత్ సుందరకాండ చిత్రంలో నటిస్తున్నారు, దీని దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి.
మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.