fbpx
Friday, October 18, 2024
HomeNationalపాక్ బాంబులకు సైతం చెక్కుచెదరని తనోట్​ మాత ఆలయం

పాక్ బాంబులకు సైతం చెక్కుచెదరని తనోట్​ మాత ఆలయం

Thanot Mata temple is unscathed even by Pakistani bombs

జాతీయం: పాక్ బాంబులకు సైతం చెక్కుచెదరని తనోట్​ మాత ఆలయం

ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు ఆశ్రయాన్ని అందించడానికి భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్ మాత దేవాలయం మంచి ఉదాహరణ. ఈ ఆలయం యుద్ధ కాలంలో జరిగిన బాంబు దాడుల నుంచి భారత జవాన్లను కాపాడినట్లుగా స్థానికులు నమ్ముతారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పాకిస్థాన్​ సరిహద్దుకు సమీపాన తనోట్‌ మాత దేవాలయం ఉంది. అమ్మవారిపై ఉన్న అపార నమ్మకంతో, ఈ ఆలయంలో నిర్వహించబడే అన్ని ఏర్పాట్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్లు స్వయంగా చూస్తున్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఈ దేవాలయం, భక్తుల విశ్వాసానికి అద్దం పడుతోంది. తనోట్ మాత ఆలయం అనేక అంశాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.

తనోట్ మాత: చరిత్ర
ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు మన భారత దేశంలో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఈ తన్నోట్ మాత ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాలో వుంది. చరణ్ కులంలో జన్మించిన ఆవాద్ దేవతను తనోట్ మాతాగా పూజిస్తారు. చరన్ సాహిత్య ప్రకారం, తానోట్ మాతను కేవలం ఈ రూపంలోనే కాకుండా హింగ్లాజ్ మాత, కర్నిమాత రూపాలలో కూడా కొలుస్తారు. తానోట్ ఆలయ స్థాపన 13వ శతాబ్దంలో రాజపుత్ర రాజు తానురావు చేతిలో జరిగింది. ఇది రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న తనోట్ గ్రామంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు అమ్మవారి ఆలయం మాత్రమే కాకుండా చారిత్రక సంఘటనల్ని కూడా వీక్షించవచ్చు.

యుద్ధ సాక్ష్యం:
1965 మరియు 1971 యుద్ధాల్లో పాకిస్తాన్ బలగాలు ఈ ప్రాంతంపై అనేక దాడులు జరిపాయి. 1965లో పాక్ సైన్యం 450కి పైగా బాంబులను ఆలయంపై విసరగా, ఒక్క బాంబు కూడా పేలలేదు. ఈ మహిమను అమ్మవారి కృపగా భక్తులు విశ్వసిస్తారు. అప్పటి నుండి ఈ ప్రాంతం భారతదేశం సైనిక విజయాలకు సాక్ష్యం. యుద్ధ సమయంలో పేలని బాంబులను మ్యూజియంలో ఉంచి సందర్శకులకు చూపిస్తున్నారు. ఇది భక్తులందరికీ ఒక అరుదైన దృశ్యం. ఈ ప్రాంతంలో చమురు మరియు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతారు

అమరజవాన్లకు నివాళి:
భారత సైన్యం విజయం సాధించిన ప్రతీకగా ఆలయ పరిసరాల్లో ‘విజయ స్తంభం’ను నిర్మించారు. ఇక్కడి జవాన్లు ప్రతీ ఏడాది నవరాత్రి మరియు పాక్‌పై విజయానికి గుర్తుగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆలయం భారత సైనికులకు ధైర్యం, ఆశయానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది.

ప్రత్యక్ష పర్యాటక కేంద్రం:
తనోట్ ఆలయం కేవలం భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ముఖ్య ఆకర్షణగా మారింది. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, చారిత్రక ఘట్టాల నేపథ్యంలో ప్రాధాన్యతను పొందిన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ముందు, పర్యాటకులు సైనిక అనుమతి పత్రాలను పొందాల్సి ఉంటుంది. బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆలయ నిర్వహణను చూస్తున్నారు.

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక స్థలం
ఈ ఆలయం జైసల్మేర్ నగరానికి 122 కిలోమీటర్ల (76 మైళ్ళు) దూరంలో ఉంది. రోడ్డు మార్గాన ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది. ఈ ప్రాంతంలో అధిక సగటు విండ్‌స్పీడ్ ఉంది. తానోట్ రహదారి చుట్టూ ఇసుక దిబ్బలు, ఇసుక పర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు 49 ° C వరకు ఉండవచ్చు.

మహిమలోకి వచ్చిన ఆలయం:
భారత సైనికుల కోసం అమ్మవారి మహిమ ప్రత్యక్షంగా నిలిచిందనే విశ్వాసం నేటికీ కొనసాగుతోంది. తనోట్ మాత ఆలయాన్ని ప్రతి ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. ప్రత్యేకించి నవరాత్రి వేడుకల సమయంలో ఆలయం సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరేందుకు రుమాలులతో ముడుపులు కడతారు, కోరిక తీరిన తర్వాత వాటిని మోక్షంగా తీసుకుంటారు.

సందర్శన సమయం మరియు పర్యాటక సమాచారం:
తనోట్ ఆలయం ప్రధానంగా నవంబర్ నుండి జనవరి వరకు సందర్శనకు ఉత్తమ సమయం. పర్యాటకులు జైసల్మేర్ నగరం నుండి ప్రయాణించి రెండు గంటల్లో ఈ పవిత్ర స్థలాన్ని చేరుకోవచ్చు. టాక్సీల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular