మూవీడెస్క్: అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రతో మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడానికి పుష్ప 2 సర్వం సిద్ధమైంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప 2: ది రూల్” పై అంచనాలు నలువైపులా ఆకాశాన్ని తాకుతున్నాయి.
పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా, మొదటి భాగం విజయాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా ఉండబోతుందని చెప్పవచ్చు.
ఈ సారి కథ పుష్ప రాజ్ జీవితంలోని కీలక మలుపులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఫహాద్ ఫాసిల్ మళ్లీ ప్రధాన ప్రతినాయకుడిగా పుష్పకు గట్టి పోటీ ఇవ్వనున్నాడు.
రష్మిక మందన్నా పాత్రలో కూడా ఆసక్తికరమైన మార్పులు ఉన్నట్లు సమాచారం.
పుష్ప రాజ్ చుట్టూ నడిచే పాలిటికల్ ముఠా రాజకీయం, ప్రతీకారం, మరియు ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి.
సినిమాను గ్రాండ్ లెవెల్‌లో ప్రమోట్ చేసేందుకు డిసెంబర్ 4న ముంబైలో ప్రత్యేక ప్రీమియర్ షో ప్లాన్ చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5 అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు.
హిందీ సహా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.