మూవీడెస్క్: సూర్య నటించిన భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కంగువా నవంబర్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాను 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్, టీజర్ లకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు గణనీయంగా పెరిగాయి.
300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ మరియు UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు.
ఈ చిత్రం రెండు కాలగమనాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ట్రైబల్ వారియర్ కంగువా పాత్ర, మరొకటి ప్రెజెంట్ డేలో ఫ్రాన్సిస్ పాత్ర.
ఈ రెండు పాత్రల మధ్య ఉండే మిస్టీరియస్ కనెక్షన్ కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుంది.
తాజా సమాచారం ప్రకారం, 2 గంటల 26 నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఫైనల్ కట్ సిద్ధమైందట.
ఇటీవలి పీరియాడికల్ సినిమాల రన్ టైమ్ ఎక్కువగా ఉంటోంది. కానీ దర్శకుడు శివ ఈ సినిమాను కాంపాక్ట్‌గా, వేగవంతమైన నేరేషన్‌తో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
కథలో ల్యాగ్ లేకుండా చక్కని ఫ్లో ఉంటుందని టాక్. 2 గంటల కథ ప్రధానంగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండగా, మిగిలిన 26 నిమిషాలు ఫ్రాన్సిస్ పాత్ర చుట్టూ నడుస్తాయని తెలుస్తోంది.
ఈ తక్కువ రన్ టైమ్ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
“కంగువా” రెండో భాగం కూడా ప్లాన్‌లో ఉండటంతో, ఈ మొదటి భాగం విజయం సినిమాపై భారీ ప్రభావం చూపనుంది.