fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsగోపిచంద్ విశ్వం బాక్సాఫీస్ కలెక్షన్స్

గోపిచంద్ విశ్వం బాక్సాఫీస్ కలెక్షన్స్

GOPICHAND-VISWAM-BOX-OFFICE-COLLECTIONS
GOPICHAND-VISWAM-BOX-OFFICE-COLLECTIONS

మూవీడెస్క్: గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మాస్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ కి సరైన కమర్షియల్ సక్సెస్ కొంతకాలంగా దక్కలేదు.

ఫ్లాప్ దర్శకుడితో కలిసి చేసిన ఈ సినిమా పైన కూడా పెద్దగా అంచనాలు లేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది.

24 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం 10 కోట్ల వరకు మాత్రమే జరిగింది.

సినిమా విడుదలై 4 రోజులు పూర్తి కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

అందులో 4.40 కోట్ల షేర్ మాత్రమే ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే, ఇంకా 5.60 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది.

నైజాంలో ఈ సినిమా 4 రోజుల్లో 1.43 కోట్ల షేర్, ఆంధ్రాలో 2.45 కోట్ల షేర్ సాధించగా, ఇతర ప్రాంతాలు మరియు ఓవర్సీస్ లో 52 లక్షల షేర్ వసూలు చేసింది.

తొలిరోజులు ఓ మోస్తరు వసూళ్లు వచ్చినా, సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గాయి. ఇకపై “విశ్వం” సినిమా లాంగ్ రన్ లో ఎలా కొనసాగుతుందో చూసి తెలుసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular