మూవీడెస్క్: పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోలను వెతుకుతున్నారు. ‘లైగర్’ మరియు ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఆయనకు ఒక భారీ హిట్ కావాలి.
గతంలో పూరీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన డైరెక్టర్‌గా తన స్టైల్‌తో బాక్సాఫీస్‌ను శాసించారు.
కానీ, ఇప్పుడు సీనియర్ హీరోలు పూరీతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదని సమాచారం.
తాజాగా పూరీ, యంగ్ హీరోలపై దృష్టి పెట్టారు. ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా, అది వర్క్ అవుట్ కాలేదు.
ఇప్పుడు పూరీ, అఖిల్ అక్కినేని ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అఖిల్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందువల్లే కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.
పూరీ గతంలో నాగార్జునతో ‘శివమణి’ వంటి హిట్ సినిమా చేశారు. ఈ నేపధ్యంలో, అఖిల్ కూడా పూరీతో కలిసి పని చేయవచ్చని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
మరి ఫైనల్ గా పూరీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో సెట్టవ్వాలనుకుంటున్నాడో వేచి చూడాలి.