మూవీడెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన హిట్ మూవీ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రాన్ని 2025 సంక్రాంతి విడుదలకు సిద్ధం చేయాలని ప్లాన్ చేశాడు.
కానీ, ఇప్పటివరకు సినిమా ట్రాక్‌లోకి రావడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా హీరో విషయంలో అనేక రకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.
లేటెస్ట్ టాక్ ప్రకారం, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ముందుగా ప్రశాంత్ వర్మ ఈ కథను టాలీవుడ్‌లోని, ఇతర ఇండస్ట్రీలలోని చాలా మంది హీరోలకు కూడా నేరేట్ చేశాడు.
‘కేజీఎఫ్’ హీరో యశ్, రానా దగ్గుబాటి, సూర్య, ఇంకా పలువురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, ఎవరికీ ఈ ప్రాజెక్ట్ అంతగా సెట్ అవ్వలేదు.
ఇప్పటివరకు కొంతమంది హీరోలు కథ బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఒప్పుకోలేకపోయారు.
ఎట్టకేలకు, రిషబ్ శెట్టిని సెట్ చేసేందుకు ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. హనుమాన్ వంటి సూపర్ హిట్ తర్వాత కూడా, సీక్వెల్ కాస్టింగ్ సమస్యలు ఎదురవడం ఆసక్తికరం.
రిషబ్ శెట్టి తో అనుకున్నట్లుగా ప్రాజెక్ట్ సెట్ అయితే, ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మరింత క్రేజ్ సంపాదించే అవకాశం ఉంది.