మూవీడెస్క్: తక్కువ సినిమాలే తీసినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.
ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తనదైన మార్క్ సృష్టించారు.
ప్రస్తుతం రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు, ఇది కూడా మంచి అంచనాలు నెలకొల్పింది.
ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి పని చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకేష్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని, కథను శివ కార్తికేయన్‌కు వివరించారని తెలుస్తోంది. దీంతో ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాక, కూలీ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పై పని మొదలుపెట్టనున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఉంటుందని టాక్.
శివ కార్తికేయన్ నటనలో ఎమోషన్, హాస్యానికి మంచి మార్కులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక లోకేష్ మాస్ యాక్షన్ మూవీ మేకింగ్‌కు పాపులర్.
వీరిద్దరి కలయిక మీద సినీ ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.