fbpx
Sunday, October 20, 2024
HomeMovie Newsచిరంజీవి, బాలకృష్ణ కాంబో.. బోయపాటి హింట్

చిరంజీవి, బాలకృష్ణ కాంబో.. బోయపాటి హింట్

BOYAPATI-HINTS-CHIRANJEEVI-BALAKRISHNA-COMBO
BOYAPATI-HINTS-CHIRANJEEVI-BALAKRISHNA-COMBO

మూవీడెస్క్: తెలుగు చిత్రసీమలో చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi, Balakrishna) స్థాయిని వేరే చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కూడా తమ కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్లు కొట్టారు.

కానీ ఇప్పటివరకు ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒకే సినిమాకు నటించకపోవడం ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించింది.

ఈ కాంబో చూడాలని అభిమానులు చాలా కాలంగా వేచిచూస్తున్నారు.

తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా హాజరై, ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.

చిరు మాట్లాడుతూ, బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అని చెప్పడంతో, బాలయ్య కూడా వెంటనే తన అంగీకారాన్ని తెలిపాడు.

అప్పటి నుంచి ఈ మల్టీస్టారర్ పై ప్రచారం ఊపందుకుంది.

ఇటీవల బోయపాటి శ్రీను కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో, ఈ కాంబినేషన్ మరోసారి హైప్ తీసుకుంది.

“వీరితో కథ రాయకపోతే దేనికి వాడిన” అంటూ బోయపాటి చెప్పడం, ఈ క్రేజీ కాంబో త్వరలో తెరకెక్కుతుందనే సంకేతాలు ఇస్తోంది.

ఫ్యాన్స్ సంతోషం పంచే ఈ ప్రాజెక్టు ఎప్పుడు రాబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular