fbpx
Friday, December 27, 2024
HomeTop Storiesఆండ్రాయిడ్ ఫోన్లకు బ్లాక్ రాక్ మాల్ వేర్ ముప్పు!

ఆండ్రాయిడ్ ఫోన్లకు బ్లాక్ రాక్ మాల్ వేర్ ముప్పు!

BLACKROCK-MALWARE-ATTACKS-ANDROID-PHONES

న్యూఢిల్లీ: ‘బ్లాక్‌రాక్‌’ అనే పేరుతో ఒక మాల్‌వేర్‌ చలామణిలో ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రక్రియ ఈ మాల్వేర్ లో నిక్షిప్తం చేసి ఉంది అని తెలిపారు.

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉండే దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్‌ సమాచారాన్ని సేకరించేలా ప్రోగ్రాం చేసుందని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్‌ ఆప్స్‌ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ’ (సెర్ట్‌.ఇన్)‌ హెచ్చరించింది. ఈ ట్రోజన్‌ వైరస్‌ ఇప్పటికే ప్రపంచమంతా ఆండ్రాయిడ్ ఫోన్లలో చక్కర్లు కొడుతోందని సెర్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్‌ బ్యాంకింగ్‌ మాల్‌వేర్‌ సోర్స్‌కోడ్‌ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్‌ అనేది లోకిబోట్‌ ఆండ్రాయిడ్‌ ట్రోజాన్‌ అని సెర్ట్‌ తెలిపింది. ఈ వైరస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్‌ డ్రాయర్‌ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్‌ అప్‌డేట్‌ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని తెలియజేశారు.

ఒక్కసారి మొబైల్ లో అనుమతులు వస్తే, ఇక వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం తస్కరిస్తుందని సెర్ట్‌ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్‌లోడ్‌/ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్‌వేర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular