fbpx
Tuesday, October 22, 2024
HomeMovie Newsఅఖండ 2 కోసం బాలీవుడ్ స్టార్?

అఖండ 2 కోసం బాలీవుడ్ స్టార్?

BOLLYWOOD-STARS-FOR-BALA-KRISHNA-AKHANDA-2
BOLLYWOOD-STARS-FOR-BALA-KRISHNA-AKHANDA-2

మూవీడెస్క్: అఖండ సినిమాతో మాస్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ, అదే విజయాన్ని కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న బాలయ్య, తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అఖండ 2’ కోసం కూడా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రం గతంలో పెద్ద హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా రానుంది. ‘అఖండ 2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

ఈ సారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దీంతో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ కనెక్ట్ అయ్యేలా నటీనటులను ఎంపిక చేయాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారు.

ముఖ్యంగా కీలక విలన్ పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో సంజయ్ దత్‌ను ఆ పాత్ర కోసం కాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.

త్వరలోనే ఆయనకు కథ వినిపించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నారని సమాచారం.

ఒకవేళ ఆయన అంగీకరిస్తే బాలీవుడ్ మార్కెట్‌లో సినిమాకు మంచి బజ్ వచ్చే అవకాశం ఉంది.

‘అఖండ 2’ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నందమూరి తేజస్విని సమర్పణలో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular