మూవీడెస్క్: తెలుగు సినిమాల్లో ఐకాన్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు సంబంధించిన వివాదం తెలిసిందే.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలవడం, బన్నీ మర్యాదపూర్వకంగా విష్ చేయడం మెగా అభిమానులకు అసంతృప్తి కలిగించింది.
ఈ పరిణామం ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
అయితే, ఆ పర్యటనకు ముందస్తు అనుమతులు లేకుండా భారీ వాహనాలు, బైక్ ర్యాలీతో నంద్యాల వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రిటర్నింగ్ అధికారి నివేదిక మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించి, విచారణ సోమవారం జరపనున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా పనులతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.
పుష్ప-2 ప్రమోషన్‌లో భాగంగా బన్నీ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా నంద్యాల వివాదంపై అల్లు అర్జున్ స్పందించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరి కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో వేచి చూడాలి.