fbpx
Tuesday, October 22, 2024
HomeMovie Newsరికార్డ్ స్థాయిలో NBK109 ప్రీరిలీజ్ బిజినెస్

రికార్డ్ స్థాయిలో NBK109 ప్రీరిలీజ్ బిజినెస్

RECORD-PRE-RELEASE-BUSINESS-FOR-NBK109
RECORD-PRE-RELEASE-BUSINESS-FOR-NBK109

మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

వరుస హిట్లతో జోరు మీద ఉన్న బాలయ్య నుంచి మరో బ్లాక్‌బస్టర్ రాబోతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

‘NBK109’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్యకు ఇదివరకు సెట్ అయిన భారీ బిజినెస్ లెక్కల్ని ఈ సినిమా దాటేసింది.

ప్రీరిలీజ్ బిజినెస్ గురించి చర్చిస్తే, తెలుగు రాష్ట్రాల్లో 35-40 కోట్ల మధ్య డిస్ట్రిబ్యూషన్ రైట్స్ డీల్ కుదిరినట్లు సమాచారం.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 75 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసిందని తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ రేంజ్ లో ఈ సినిమా 90 కోట్లకు పైగా బిజినెస్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.

బిజినెస్ లెక్కన చూస్తే, ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవాలంటే 100 కోట్లకు పైగా షేర్ సాధించాలి.

ఆ స్థాయిలో కలెక్షన్స్ అందితే, బాలయ్య తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నిలుస్తారు.

బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ‘అఖండ 2’ కూడా ఇటీవల ప్రారంభమైంది.

నవంబర్ నుండి ఈ పాన్ ఇండియా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular