న్యూఢిల్లీ: మెటాతో ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక ఒప్పందం
మెటా సహకారంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాస్ట్ సర్టిఫికెట్ లాంటి ధ్రువపత్రాలను పొందాలంటే ప్రజలు ఇప్పటివరకు మూడు లేదా నాలుగు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాగే కరెంటు బిల్లులు, ఇంటి పన్ను, ఇతరత్రా సేవలు కోసం గంటల తరబడి ఆఫీసులలో క్యూలు పెట్టాల్సి వచ్చింది. ఈ కఠిన పరిస్థితులకు చెక్ పెట్టేందుకు, ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
మెటాతో ఏపీ ఒప్పందం – డిజిటల్ సేవల్లో నూతన దశ
నారా లోకేశ్ నేతృత్వంలో, ఏపీ ప్రభుత్వం మెటా సంస్థతో ఎంవోయూ (మొమరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పౌరులు వాట్సప్ ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా కాస్ట్ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, ఇతరత్రా ధృవపత్రాలు ఇకపై వాట్సప్ ద్వారా సులభంగా లభ్యమవుతాయి.
లోకేశ్ యువగళం పాదయాత్రలో యువతావాణి
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా సర్టిఫికెట్లు పొందడం సులభతరం చేయాలన్న ఆలోచన ప్రాధాన్యత పొందింది. అప్పుడే హామీ ఇచ్చిన నారా లోకేశ్, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట నిలబెట్టుకుని మెటాతో ఒప్పందం చేసుకున్నారు. ఇది పౌరులకు మిగిలిన సేవల కోసం కూడా ఉపయోగపడేలా మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లో తీసుకురాబోతున్నారు.
వాట్సప్ బిజినెస్ ద్వారా మరిన్ని సౌకర్యాలు
ఏపీ ప్రభుత్వం వాట్సప్ బిజినెస్ ద్వారా మెటా సంస్థతో పౌరసేవలు మరింత విస్తరించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వంతో కలిసి డిజిటల్ సేవలను ప్రజలకు సులభంగా అందించడం తమకు గర్వంగా ఉందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరిన్ని సేవలు, పౌర సౌకర్యాలు వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేశారు.
వాస్తవ సాఫల్యం – లోకేశ్ నేతృత్వంలో వేగవంతమైన పాలన
గతంలో ఏపీకి హెచ్‌సిఎల్, ఫాక్స్‌కాన్, టిసిఎల్ వంటి కంపెనీలను ఆకర్షించిన నారా లోకేశ్, ఇప్పుడు మెటాతో మరో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల ప్రజలకు అవసరమైన పత్రాలు, బిల్లులు, ఇతర సేవలు సులభంగా వాట్సప్ ద్వారా అందుబాటులోకి రావడం ప్రారంభమవుతుంది. లోకేశ్ నాయకత్వం క్రింద ఈ గవర్నెన్స్ కార్యాచరణ వేగవంతంగా, పారదర్శకంగా అమలవుతుందని ప్రజల విశ్వాసం బలపడుతోంది.
వినూత్న టెక్నాలజీ సాయంతో పౌర సేవలు
మెటా సంస్థ నుంచి టెక్నికల్ సపోర్ట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా, ఏపీ ప్రభుత్వం మరిన్ని పౌరసేవలను డిజిటల్ గా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందం ద్వారా సర్టిఫికెట్ల జారీ విధానం మరింత సులభతరం అవుతుంది, ఫేక్ సర్టిఫికెట్ల అవకాశం లేకుండా, నిబంధనలతో సాగుతుంది.
ప్రజలకు అంతా డిజిటల్ పద్దతిలో
రానున్న రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు, అన్ని రకాల పత్రాలను పొందే పద్ధతులు వాట్సప్‌లోనే పూర్తవుతాయని నారా లోకేశ్ తెలిపారు. అలాగే, కరెంటు, నల్లా బిల్లులు వంటి సేవలు కూడా ఇకపై దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొబైల్ ద్వారా పొందవచ్చు.