ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు పార్టీల కూటమి నామినేటెడ్ పదవుల పంపకం కీలకంగా మారింది. ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా, 20 శాతం నామినేటెడ్ పదవులు జనసేన, బీజేపీల మధ్య పంచుకునేందుకు చంద్రబాబు సహకారాన్ని తెలియజేశారు. ఇది ఇప్పుడు రెండు పార్టీల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
ఇక నామినేటెడ్ పదవులు పంపకం విషయంలో బీజేపీ పైచేయి సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా బీజేపీ టీడీపీ సీట్ల విషయంలో కీలకంగా వ్యవహరించింది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ, ఇప్పుడు పదవుల విషయంలోనూ ప్రధాన పాత్ర పోషించవచ్చని అంచనా వేస్తున్నారు.
జనసేన పార్టీ మాత్రం ఈ అంశంలో సర్దుకు పోవాలని చూస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ 20 శాతం పదవుల్లో మెజారిటీ షేర్ తీసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే సమయంలో, జనసేన పార్టీకి బలమైన మద్దతు ఉండటం వల్ల సగం సగం పంచుకునే అవకాశం కూడా ఉంది.