పూణే: : New Zealand vs India: భారత్ న్యూజిలాండ్ మధ్యన 2వ టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లంచ్ విరామానికి ముంది 31 ఓవర్లలో న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
రవిచంద్రన్ అశ్విన్ తన సునిశితమైన బౌలింగ్‌తో భారతకు రెండో వికెట్ అందించాడు. అశ్విన్ విల్ యంగ్‌ను 18 పరుగులకే అవుట్ చేశాడు.
డెవాన్ కాన్వే 47 పరుగులతో క్రీజ్‌లో ఉండగా, రచిన్ రవీంద్ర జత అయ్యాడు. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ బలమైన భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది.
భారత బౌలర్లు వీలైనంత వేగంగా వికెట్లు పతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సిరీస్‌లో 0-1 వెనుకబడిన భారతం తన ప్లేయింగ్ Xఈ లో కాస్త మార్పులు చేసింది.
కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానంలో శుభ్మన్ గిల్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకుంది.