మూవీడెస్క్: సంక్రాంతి బరిలో సందీప్ కిషన్! సంక్రాంతి సీజన్ టాలీవుడ్ చిత్రసీమకు చాలా ప్రత్యేకం. ఏటా ఈ సీజన్‌లో బడా హీరోల సినిమాలు వసూళ్ల పండగను జరుపుతుంటాయి.
రాబోయే సంక్రాంతి సీజన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా జరగబోతున్నా, ఈసారి కొన్ని వాయిదాలు, మార్పుల కారణంగా యంగ్ హీరో సందీప్ కిషన్‌కు మంచి అవకాశం వచ్చింది.
ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సంక్రాంతికి రాబోతుందని అనుకున్నా, అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది.
అదే సమయంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మరియు బాలకృష్ణ ‘NBK 109’ మాత్రం సంక్రాంతికే ఫిక్స్ అయ్యాయి.
మరోవైపు నాగచైతన్య ‘తండేల్’ కూడా ఈ బరిలోకి రావడం ఖాయం అనుకున్నా, ఇప్పుడు ఆ సినిమా రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో, సంక్రాంతి థియేటర్లలో చోటు దక్కించుకోవడానికి సందీప్ కిషన్ ‘మజాకా’కి మంచి ఛాన్స్ లభించింది.
తండేల్ తప్పుకుంటే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ కోసం పెద్ద సంఖ్యలో థియేటర్లు ప్లాన్ చేసినప్పటికీ, మిగతా వాటిలో మజాకా దొరకవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేశ్, అన్షు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
మరి ఈ సంక్రాంతి బరిలో సందీప్ కిషన్‌కు అదృష్టం కలిసి వస్తుందా అనేది చూడాలి.