fbpx
Thursday, October 24, 2024
HomeAndhra Pradeshచంద్రబాబు కౌంటర్: కుటుంబ వివాదం రాజకీయం చేస్తారా?

చంద్రబాబు కౌంటర్: కుటుంబ వివాదం రాజకీయం చేస్తారా?

chandrababu-counter-ys-jagan-family-dispute

చంద్రబాబు: వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలల మధ్య ఆస్తి వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ గొడవను టీడీపీతో కలిపి రాజకీయం చేస్తున్నారని జగన్ చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.

‘‘మీ ఇంట్లోని గొడవల్లో టిడిపిని ఎందుకు లాగుతున్నారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో వాటా భార్యకు, మాతృమూర్తులకు రాదా అని నిలదీశారు. ‘‘జగన్ 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా పెరిగింది? ఆ డబ్బంతా ఎలా సంపాదించారో చెప్పాలంటూ’’ ప్రశ్నలు వేశారు.

‘‘జగన్ రాజకీయాల్లో చిల్లర పనులు చేస్తూ, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘విలువలు లేని జగన్ వంటి నాయకుల వల్ల సమాజానికి చేదు పరిణామాలు ఉంటాయి.

వైసీపీ తరఫున 10 లక్షల సాయాన్ని ప్రకటించడం కూడా పేదలను మోసం చేయడమే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ఇక నుంచి విలువలు లేని రాజకీయాలు నడిపే స్థాయి మాకు లేదు’’ అని తేల్చి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular