మంగళగిరి: ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నుంచి దాదాపు పది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్య లక్ష్యం భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం.
ఇప్పటికే రాష్ట్రంలో పలు కంపెనీలను స్థాపించేందుకు లోకేష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టాటా కంపెనీతో చర్చలు జరిపి, విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై మంతనాలు చేశారు.
అదేవిధంగా శివనాడార్ సంస్థ, జపాన్ దౌత్య బృందంతోనూ పెట్టుబడుల అంశంపై లోకేష్ చర్చలు సాగించారు. ప్రస్తుతం తొలిసారి పెట్టుబడుల కోసం ఆయన అమెరికాకు పయనమవుతున్నారు.
అక్కడ టెస్లా, గూగుల్, మెటా సంస్థలతో చర్చలు జరిపి, ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు ప్రోత్సహించడమే లోకేష్ లక్ష్యం.
ఇప్పటి అమెరికా పరిస్థితిని చూస్తే, రాజకీయంగా హాట్ హాట్‌గా మారుతోంది. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పెట్టుబడిదారులు, వ్యాపారవర్గాలు తమ నిర్ణయాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ట్రంప్ గెలిస్తే దేశీయ పెట్టుబడులే ప్రాధాన్యం పొందే అవకాశం ఉండగా, నారా లోకేష్ విజయవంతంగా పర్యటన పూర్తి చేస్తారని ఆశిద్దాం.