మూవీడెస్క్: టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి.. తన సింప్లిసిటీ, నేచురల్ యాక్టింగ్ తో దక్షిణాది సినీ ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
సినిమాలు తక్కువ చేసినా, స్క్రిప్ట్ బాగుంటేనే ఒప్పుకోగల సెన్సిబుల్ హీరోయిన్.
అదే కారణంగా అగ్ర హీరోల సినిమా అయినా కథ నచ్చకపోతే నో చెప్పడానికి వెనకాడదు.
ఇప్పటి వరకు సాయిపల్లవి పాన్ ఇండియా స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకోలేదు.
కానీ, ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘రామాయణం’ హిందీ సినిమా ద్వారా బీటౌన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చూస్తోంది.
ఈ మూవీలో సీత పాత్రలో నటిస్తుండటంతో హిందీ మార్కెట్ లో మంచి రీచ్ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే సాయిపల్లవి హిందీ మార్కెట్ పట్ల ఆసక్తి చూపడం లేదని ఇటీవల తేల్చి చెప్పింది.
సాయిపల్లవి తనను తాను పీఆర్ లతో ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టపడదు.
ఓసారి బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీ నుంచి ఆఫర్ వచ్చినా.. ఇమేజ్ కోసం పీఆర్ వ్యవస్థను ఆశ్రయించడం తనకు నచ్చదని, కేవలం మంచి కథలు వస్తే వాటిని మాత్రమే చేస్తానని ఆమె స్పష్టం చేసింది.
మరోవైపు హిందీ మార్కెట్ లో నటించినప్పటికీ సాయిపల్లవి అక్కడ పాపులారిటీ పై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు.
ఆమె ప్రస్తుతం దక్షిణాది మార్కెట్ పై దృష్టి పెట్టింది. మరి ‘రామాయణం’తో బాలీవుడ్ ప్రేక్షకులకు సాయిపల్లవి ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.