మూవీడెస్క్: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పుష్ప-1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్పరాజ్ స్వాగ్ ను మళ్ళీ తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా భారీ హైప్ ఉంది. డిసెంబర్ 5న తెలుగు సహా పలు భాషల్లో సినిమా విడుదలవుతుంది.
తాజాగా మేకర్స్ ప్రమోషన్లకు వేగం పెంచి, భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించింది.
నాన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ డీల్స్ పుష్ప క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ హైప్ దృష్ట్యా, పుష్ప-2 కు పోటీగా డిసెంబర్ 6న విడుదల కానున్న బాలీవుడ్ మూవీ ‘ఛావా‘ తాత్కాలికంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఛావా, శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది.
డిసెంబర్ 6న విడుదల చేయాలని తొలుత అనౌన్స్ చేసినా, పుష్ప-2 బజ్ ను చూసి మేకర్స్ తిరిగి ఆలోచనలో పడ్డారు.
భారీ బడ్జెట్ పెట్టుబడులు, బాక్సాఫీస్ పోటీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాను వాయిదా వేసే యోచనలో ఉన్నారు.