fbpx
Saturday, October 26, 2024
HomeMovie Newsఓజీ మూవీ సెట్స్ లో అకీరా కనిపించాడా?

ఓజీ మూవీ సెట్స్ లో అకీరా కనిపించాడా?

IS-AKIRA-NANDAN-IN-OG-SHOOTING-SETS
IS-AKIRA-NANDAN-IN-OG-SHOOTING-SETS

మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఓజీ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొంత వరకు పూర్తి కాగా, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ మూవీపై తాజా ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో చెలరేగుతోంది.

వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఫైట్ సీన్ షూట్ అవుతున్నట్లు చూపించగా, ఇందులో ఉన్నది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ మ్యానరిజంను అనుకరిస్తూ కనిపిస్తుండటంతో, పవర్ స్టార్ వారసుడే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇదే సమయంలో, మరికొంత మంది ఈ వీడియో అకీరా నందన్ కాదని, పవన్ పాత సినిమాకు సంబంధించినదని అంటున్నారు.

అకీరా నటించడం విషయంపై అధికారిక సమాచారం ఏదీ విడుదల కాలేదు.

కానీ, అకీరా సిల్వర్ స్క్రీన్ పై కన్పిస్తాడా అనే ప్రశ్న మాత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular