fbpx
Thursday, January 2, 2025
HomeAndhra Pradeshఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయసాధన కోసం కసరత్తు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయసాధన కోసం కసరత్తు

 ఆంద్రప్రదేశ్: తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపాయి. సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడ
tdp-strategizes-for-mlc-election-victory

ఆంధ్రప్రదేశ్‌: పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది, కాగా వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కూటమి విజయాన్ని సాదించడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

జనసేన, బీజేపీతో సమన్వయం సాధించి, ప్రతి ఓటును టీడీపీకి మద్దతుగా నిలుపుకునేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు.

తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణా – గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించుకోవడం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది. టీడీపీ నేతలు ప్రజలను ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఓటుకు విలువ ఉన్నందున, ఆ ఓట్లు తమ పార్టీకి పడేలా నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.

ఈ సారి గెలుపు సాధనకు టీడీపీ నాయకులు తమ శక్తివంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న చిన్నపాటి విభేదాలు ఐక్యతపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. కానీ, చంద్రబాబు దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular