హైదరాబాద్ : ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ కూడా పార్టిసిపంట్స్ ఎవరని, హోస్ట్ ఎవరని రకరకాల రూమర్స్, రూమర్స్ వచ్చిన సెలబ్రిటీస్ రెస్పాన్స్ ఈ సారి కూడా బాగానే జరుగుతున్నాయి. కొన్ని యు ట్యూబ్ చానల్స్ అయితే పార్టిసిపంట్స్ వీళ్ళే అని అధికారిక ప్రకటనలు లేకుండానే కొన్ని పేర్లు విడుదల చేశాయి. అయితే వీటన్నిటిలో హోస్ట్ విషయంలో వస్తున్న రూమర్స్ కి మాత్రం చెక్ పెట్టినట్టయింది. నాగార్జున నేటి నుండి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని నేడు ఆయనే స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశాడు. మళ్లీ షూటింగ్ లైట్స్ కెమెరా యాక్షన్ వావ్ అంటూ ట్విట్టర్ లో ఈ ఫొటోలు పెట్టి వ్యాఖ్య ట్వీట్ చేశారు.
నాగార్జున ట్వీట్ చూస్తుంటే అందులో ఉన్న స్టైలింగ్ చూస్తుంటే ఇది బిగ్ బాస్ యాడ్ షూట్ లాగా అనిపిస్తుంది. నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ‘వైల్డ్ డాగ్’ కి సంబంధించిన లుక్ ఐతే ఇది కాదు కాబట్టి ఇది బిగ్ బాస్ యాడ్ షూట్ అనే అర్ధం ఐతుంది. అలాగే షూట్ లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా ఒక ఫోటో షేర్ చేసారు నాగ్. షూటింగ్ సహాయ సిబ్బంది పీపీఈ కిట్స్ ధరించి ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో చేసిన మూడు సీజన్లు సక్సెస్ఫుల్ గానే నిలిచాయి.
Boring, samantha oste bagundedi. Evarni pilsina paisal vallake 🙂