మూవీడెస్క్: నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హీరో కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
రీసెంట్‌గా ఈ మూవీ ఎనౌన్స్ చేశారు, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ప్రశాంత్ వర్మ క్యాస్టింగ్‌పై దృష్టి సారించి, మోక్షజ్ఞకి జోడీగా బాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోయిన్ వారసురాలిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు.
తాజాగా ఈ సినిమా కోసం టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (RANA DAGGUBATI) విలన్‌గా నటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ ఇప్పటికే రానాతో చర్చలు జరిపినట్లు టాక్. అయితే, రానా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
రానా విలన్‌గా నటిస్తే, మోక్షజ్ఞ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ కలుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో రానా కూడా ఇతర హీరోల సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో, నవంబర్ చివర్లో ఈ చిత్ర క్యాస్టింగ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై, 2025 చివరలో లేదా 2026 ప్రథమార్ధంలో ఈ మూవీ థియేటర్లలోకి రానుందని టాక్.