మూవీడెస్క్: మరో నందమూరి వారసుడు ఎంట్రీ! లెజెండరీ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు.
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, యలమంచిలి గీత నిర్మాణంలో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది. కూచిపూడి డ్యాన్సర్ వీణా రావు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో తారక రామారావు లాంగ్ హెయిర్, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
బైక్‌పై ఉన్న స్టిల్స్, ఆయన గంభీరమైన డైలాగ్ డెలివరీ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.
తాత ఎన్టీఆర్‌పై ప్రమాణం చేస్తూ పరిశ్రమకు విధేయుడిగా ఉంటానని తారక రామారావు పేర్కొన్నారు.
అస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు.
వైవీఎస్ చౌదరి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమా నందమూరి వంశం నుండి నాలుగో తరానికి ఒక స్ఫూర్తి దాయక ఎంట్రీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.