fbpx
Wednesday, October 30, 2024
HomeAndhra Pradesh"ఈ శతాబ్దపు పెద్ద జోక్‌"- షర్మిల

“ఈ శతాబ్దపు పెద్ద జోక్‌”- షర్మిల

The biggest joke of this century – Sharmila

ఆంధ్రప్రదేశ్: వైఎస్‌ షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు కుతంత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, జగన్ బెయిల్ రద్దు చేయాలని తాము కుట్ర చేస్తున్నామనే అభియోగం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని విమర్శించారు. ఈ వ్యవహారం జగన్‌కు రాజకీయం తప్ప మరొకటి కాదని ఆమె అన్నారు.

ఈడీ ఆంక్షలు స్టాక్స్‌పై కాదు, స్థిరాస్తి మాత్రమే
ఈడీ సీజ్‌ చేసినది జగన్‌ కంపెనీల షేర్లు కాదని, 32 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి మాత్రమేనని స్పష్టం చేశారు. స్టాక్ మార్పిడిపై ఎటువంటి ఆంక్షలు లేదా అభ్యంతరాలు లేవని, గతంలో కూడా ఈడీ అనేక కంపెనీల ఆస్తులను అటాచ్ చేసినా, వాటి స్టాక్స్ ట్రేడింగ్ లేదా బదిలీలను ఆపలేదని గుర్తు చేశారు.

“2016లోనే షేర్ల బదలాయింపు ఆపాలని ఈడీ ఆదేశిస్తే అప్పుడు ఎందుకు పాటించలేదు?”
2016లో ఈడీ భూములను అటాచ్ చేసినప్పుడు షేర్ల బదలాయింపుపై ఆంక్షలు ఉండగా, జగన్ ఆ ఆదేశాలనూ పాటించలేదని షర్మిల ఆరోపించారు. 2019లో ఎంఓయూ ఆధారంగా 100 శాతం వాటాలు బదిలీ చేసే విషయమై సంతకం చేసి, 2021లో సండూర్ పవర్ మరియు క్లాసిక్ రియాల్టీకి చెందిన షేర్లను రూ. 42 కోట్లకు అమ్మడం జగన్‌ కుట్రలో భాగమని ఆమె విమర్శించారు.

విజయమ్మకి స్పష్టత
షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబధం లేదని జగన్‌కు కూడా తెలుసు కాబట్టే అప్పుడు సంతకాలు చేశారని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్​సీఎల్​టీలో కేసు ఉంది కాబట్టి షేర్ల గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని, కొడుకు బెయిల్​కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకి తెలుసని షర్మిల పేర్కొన్నారు.

సబ్‌ జుడీస్ నిబంధనలపై వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటన
కేసు ఎన్‌సీఎల్‌టీ పరిధిలో ఉన్నందున, షేర్ల విషయంపై మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని షర్మిల చెప్పారు. తన తల్లి విజయమ్మకు కుమారుడి బెయిల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని ఆమె విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular