fbpx
Wednesday, October 30, 2024
HomeTelanganaతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్

dearness-allowance-increase-telangana-govt-employees

తెలంగాణ: ప్రభుత్వం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. పెరుగుదలతో వచ్చే నవంబర్ నెల జీతంతో ఈ డీఏ మొత్తాన్ని చెల్లించనుంది.

డీఏ పెంపును 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు బకాయిలుగా ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. పదవీ విరమణకు 2024 మార్చి 31లోపు చేరుకోనున్న ఉద్యోగులకు ఈ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు.

అలాగే సీపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయగా, మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు.

ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఈ డీఏ బకాయిల చెల్లింపులను 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ డీఏ పెంపు ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular