fbpx
Tuesday, December 24, 2024
HomeMovie Newsబాక్సాఫీస్: దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం “క”

బాక్సాఫీస్: దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం “క”

KIRAN-ABBAVARAM-KA-ROCKING-AT-BOX-OFFICE
KIRAN-ABBAVARAM-KA-ROCKING-AT-BOX-OFFICE

మూవీడెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (KIRAN ABBAVARAM), తాజాగా క సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

సుజిత్ మరియు సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రానికి మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

క చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే మంచి స్పందన వచ్చింది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

దీంతో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఈ సినిమా ద్వారా కిరణ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.

సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. క చిత్రం కిరణ్ కెరీర్‌లో మరో కీలక చిత్రం అవుతుందనే అంచనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular