ఏపీ: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దీపావళి సందర్భంగా ప్రారంభించిన “దీపం-2” పథకం ప్రారంభోత్సవంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ పేర్కొన్నదేంటంటే, జనసేనకు 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని, భవిష్యత్తులో ఆ నీచమైన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తమ ప్రభుత్వం మంచిది, కానీ మెత్తదేమీ కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నేటి సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా అందిస్తామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శల పరంపర కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు షర్మిలకు ప్రాణహాని ఉందని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్న నేపథ్యంలో, పవన్ ఆమెకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. “మీ అన్న రక్షణ ఇవ్వలేకపోయినా, ఈ కూటమి ప్రభుత్వం మీకు రక్షణగా ఉంటుంది,” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.