యూఎస్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ హిందూ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు భారతీయ వర్గాలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముఖ్యంగా, ఉపాధ్యక్ష పదవికి భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఉంటే, ఆమె తరఫున డెమొక్రాట్లు ప్రచారం పెంచారు. అయితే, మరోవైపు భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ట్రంప్ వైపు మొగ్గు చూపారు.
ఇటీవల ట్రంప్ భారతీయ హిందువులను ఆకర్షించే దిశగా కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే, అమెరికాలో హిందూ వర్గాలకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ర్యాడికల్ లెఫ్ట్ నేతల ధర్మ వ్యతిరేక ప్రవర్తనను కట్టడి చేస్తానని, హిందువుల ధర్మాన్ని, సంప్రదాయాలను అవమానించే చర్యలకు తాను స్వయంగా అడ్డుకట్ట వేస్తానని చెప్పారు. హిందువులకు మానసిక వేదన కలిగించే ప్రతి చర్యను కట్టడి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.
అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ట్రంప్ తెలిపారు.
భారతీయ అమెరికన్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో మెయిల్, రిజిస్టర్డ్ పోస్టుల ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతుండగా, మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.