మూవీడెస్క్: దీపావళి వీకెండ్ పండుగ సందర్భంగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేశాయి.
అయితే, వీటిలో కిరణ్ అబ్బవరం నటించిన క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్-సాయి పల్లవి అమరన్ సినిమాలు ఆడియన్స్‌ని మెప్పించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
ఈ మూడు సినిమాలు రెండు రోజుల్లోనే హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి.
ఇక ‘క’ మాస్ సెంటర్స్‌లో అదరగొడుతుండగా, లక్కీ భాస్కర్ ఏ సెంటర్స్‌లో ఆకట్టుకుంటోంది.
అమరన్ అన్ని ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సృష్టిస్తోంది.
క సినిమా విషయానికొస్తే, ఇది రెండు రోజుల్లోనే రూ.13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
మొదటి మూడు రోజుల్లో రూ.19.41 కోట్లు, నాలుగు రోజులకు చేరుకున్నప్పుడు రూ.24 కోట్ల పైగా వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఫలితంతో క సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరినట్లు సమాచారం.
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల గ్రాస్ సాధించింది.
నాలుగు రోజులు ముగిసే సరికి రూ.50 కోట్ల మార్క్ దాటి బ్రేక్ ఈవెన్ దగ్గరికి చేరినట్టు సమాచారం.
ఇక అమరన్ చిత్రానికి సంబంధించి రెండు భాషల్లో విడుదలై కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిందని టాక్.
ఈ దీపావళి వీకెండ్ మూడు సినిమాలకూ కలెక్షన్ల రేంజ్ అదిరిపోయిందని చెప్పొచ్చు.