కడప: వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు ఊడిపోయిన ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఆమె ఈ అంశంపై ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబంపై చేసిన దుష్ప్రచారం నచ్చలేదని, ప్రజలు ఆ విషయాన్ని నిజం అనుకునే అవకాశం ఉండటంతో సత్యం చెప్పాలని భావించానని తెలిపారు.
ఆ ప్రమాద ఘటనకు తన కుమారుడు జగన్ కు సంబంధం పెడుతూ, కర్నూలు ఘటనను అబద్ధాలతో నింపారని విజయమ్మ విమర్శించారు. తన మనవడి దగ్గరకు అమెరికాకు వెళ్లడం కూడా జగన్ కు భయపడి వెళ్లినట్టు చూపించడం కేవలం రాజకీయ నైజం అని మండిపడ్డారు.
ఇటువంటి ప్రచారం తనకు మానసిక వేదన కలిగిస్తుందని, ఈ ఘటనపై సమర్థవంతమైన వివరణ ఇవ్వాలని కోరారు.
ఇటువంటి దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, వ్యక్తిత్వహనన రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని విజయమ్మ హెచ్చరించారు.
ప్రజాస్వామ్య బద్ధమైన విధానంతో ప్రచారం చేయాలని, దుష్ప్రచారంతో తమ కుటుంబాన్ని, ముఖ్యంగా జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు ఆపాలని స్ఫష్టంగా తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు ఆలంబన కాకుండా నిజాయితీని గుర్తించాలని సూచించారు.