మూవీడెస్క్: సూపర్ హిట్ సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇంకా కేవలం రెండు పాటల మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉంది, ఇందులో అల్లు అర్జున్, శ్రీలీలపై వేసిన ఐటెం సాంగ్ ఒకటి.
ఈ పాటను ఈ వారం షూట్ చేయనున్నారు. అయితే మరో పాటని చిత్రంలో ఉంచాలా లేక పక్కన పెట్టాలా అనే దానిపై చిత్రబృందం ఆలోచిస్తోంది.
సినిమా లెంగ్త్ పెరగకుండా ఉండేందుకు, అలాగే ఈ పాట కథకు పెద్దగా అవసరం లేకపోవడంతో దానిని తొలగించాలని భావిస్తున్నారు.
డిసెంబరు 5న సినిమా విడుదల, కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం లేదు.
అందుకే దర్శకుడు సుకుమార్ ఈ పాటపై ఖర్చు చేయడం కంటే, టైమ్ సేవ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.
ఐటెం సాంగ్ పూర్తయిన తర్వాత ఈ విషయంపై పూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటీవల విడుదలైన ‘దేవర’ చిత్రంలోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.
‘దావుదీ’ పాటను ముందుగా తొలగించారు కానీ ఆడియెన్స్ డిమాండ్ పెరగడంతో మళ్ళీ జత చేశారు.
‘పుష్ప 2’ విషయంలో కూడా అదే తరహా ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం చివరికి ఈ పాటపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.