ఢిల్లీ: వికీపీడియా ప్లాట్‌ఫారంలో కంటెంట్ పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉందని పలువురి ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వికీపీడియాకు నోటీసులు జారీ చేసింది. వికీపీడియాలో ఉన్న సమాచారంపై కచ్చితత్వం లేదని, కొన్ని పేజీలలో పక్షపాత ధోరణి కనిపిస్తుందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.
దీంతో కేంద్రం వికీపీడియాను పబ్లిషర్‌గా పరిగణించాలని ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. ప్రస్తుతం వికీపీడియా తమను పబ్లిషర్‌గా కాకుండా, కేవలం మధ్యవర్తులుగా చూసే విధంగా చూపుతుంటే, కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడంతో సంబంధిత వ్యాఖ్యతలు కేవలం కొందరు వ్యక్తులతోనే పరిమితమై ఉంటారని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది.
చిన్న సంస్థలు, సంపాదకులకు ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నా, వికీపీడియాలో ఈ విధానాలు ఎందుకు స్పష్టంగా అమలవడం లేదని ప్రశ్నించింది.
ప్రజలకు అందించే సమాచారంలో ప్రామాణికత, నిష్పాక్షికత అవసరం అని కేంద్రం వికీపీడియాకు స్పష్టం చేసింది. ఈ నోటీసులకు వికీపీడియా స్పందించిన తరువాత కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.