ఆంధ్రప్రదేశ్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, అనంతపురం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ వ్యాఖ్యలపై తన స్పందనను వెల్లడించారు.
డీజీపీ స్పందన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన డీజీపీ, “దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ” అనే నినాదంతో తమ తమ పనితీరు కొనసాగుతుందని వ్యక్తం చేశారు. “మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయబోమని స్పష్టం చేశారు డీజీపీ. ప్రతి కేసును వాస్తవాధారాలతో విచారిస్తామన్నారు.
టీడీపీ కార్యాలయ దాడి కేసుపై క్లారిటీ
ఇక, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్ట్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమల రావు. గతంలో నేరస్తున్న పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకోలేదని విమర్శించారు..
మాజీ సీఐడీ చీఫ్‌పై విచారణ
మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతుందని, డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చాం.. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు
పవన్ ఘాటుగా స్పందించిన సందర్భం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రిగా ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని పవన్ హెచ్చరించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భావప్రకటన పేరుతో మూర్ఖత్వపూరిత పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్ ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.