fbpx
Thursday, November 7, 2024
HomeMovie Newsఅరుదైన ఉప్పు సరస్సులో నాని యాక్షన్ డోస్

అరుదైన ఉప్పు సరస్సులో నాని యాక్షన్ డోస్

NANI-ACTION-SCENES-AT-SAMBHAR-SALT-LAKE
NANI-ACTION-SCENES-AT-SAMBHAR-SALT-LAKE

మూవీడెస్క్: హిట్ సిరీస్‌ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్రాంచైజీ సినిమాలకు దారి తీస్తున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు ‘హిట్: ది థర్డ్ కేస్‌’లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.

విశ్వక్ సేన్, అడివి శేష్‌తో వచ్చిన మొదటి రెండు భాగాలు భారీ విజయాలను అందుకోవడంతో, ఈసారి నానితో హిట్ సిరీస్‌కు మరింత అంచనాలు పెరిగాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని ‘సంభార్’ ఉప్పు సరస్సు దగ్గర జరుగుతోంది.

జైపూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్ద ఉప్పు సరస్సు, భారత్‌లో ఇంతకుముందు ఇలాంటి ప్రాజెక్ట్‌ కోసం ఉపయోగించబడలేదు.

అక్కడి ప్రత్యేకత కారణంగా నాని మీద కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారు.

సంభార్ సరస్సులో నాని షూట్‌ చేయడం, టాలీవుడ్‌లో విశేషంగా చర్చనీయాంశం అవుతోంది.

ఇది భారతదేశంలోనే పెద్ద ఉప్పు సరస్సుగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో పలు నదుల నీరు చేరడంతో సహజ సౌందర్యం కనిపిస్తుంది.

తీపి, ఉప్పు నీటి ప్రదేశంలో నాని యాక్షన్ సీన్లు చేయడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular