మూవీడెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఎప్పుడూ హైప్ ఉంటుంది.
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో చివరగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్‌లు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచగా, బాక్సాఫీస్ దగ్గర కూడా అదిరిపోయే వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.
పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా కోసం భారీగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, ఈ చిత్రం కూడా భారీ వసూళ్లు రాబడుతుందని ఆశిస్తున్నారు.
పుష్ప సీక్వెల్ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ప్రారంభమవ్వనుంది. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే, ఇతర నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో, 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మైథలాజికల్ పీరియాడిక్ జోనర్‌లో ఈ చిత్రం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
త్రివిక్రమ్, బన్నీ సినిమా 2025 మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అంచనాలు పెంచేశారు.