టాలీవుడ్ : మొదలు ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు సినిమా తీసిన డైరెక్టర్ గా పేరు పొందాడు తరుణ్ భాస్కర్. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ లు వేసి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో హీరో గా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత బుల్లి తెర పైన ‘నేను మీకు చెప్తా’ అనే షో తో హోస్ట్ గా కూడా ప్రయాణం పారంభించారు. ఇలా మల్టీ టాలెంట్ తో కెరీర్ లో ముందుకు వెళ్తున్న ఈ డైరెక్టర్ ‘బిన్జ్ ఇట్’ అనే ఓ యాప్ ని సజెస్ట్ చేసాడు.
ప్రస్తుతం అందరూ ఇళ్లలోనే ఉండడంతో , థియేటర్స్ తెరచుకోకపోవడం తో ఓటీటీల్లో విడుదలైన సినిమాలు ఎక్కడ చూడవచ్చు లాంటి ప్రశ్నలకి సంధానం దొరికే యాప్ అని ఒకటి విడుదల చేసారు. నెక్స్ట్ ఏ వెబ్ సిరీస్.. నెక్స్ట్ ఏ మూవీ చూడాలి అని వెతకడం సమస్యగా మారింది. అందుకే కొందరు లోకల్ టీమ్ తో దీనికి సొల్యూషన్ ఇవ్వడానికి ఈ యాప్ ని తీసుకొస్తున్నాను అని తరుణ్ చెప్పుకొచ్చాడు. ఈ యాప్ లో మూవీ లవర్స్ కోసం మంచి కంటెంట్ ని సూచిస్తుంది. ఏ ఓటీటీలో ఏ కంటెంట్ ఉందనేది రికమెండ్ చేస్తుంది. అంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి బెస్ట్ ఇండెక్స్ లా ఇది పని చేస్తుంది. ఇందువల్ల ఓటీటీ వ్యూయర్ షిప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓటీటీలకు ఈ యాప్ చాలా హెల్ప్ చేస్తుంది.
ప్రస్తుతం ఈ ‘బింజేట్’ యాప్ లో ఉన్న సదుపాయాలూ ఇలా ఉన్నాయి
ప్రస్తుతం ఈ ‘బింజేట్’ యాప్ లో ఉన్న సదుపాయాలూ ఇలా ఉన్నాయి
- కంటెంట్ ఇష్టపడే వ్యక్తులతో కనెక్ట్ అవ్వొచ్చు.
- ఓటీటీ కంటెంట్ గురించి సమాచారం పొందడం
- మీకు నచ్చిన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసుకోవచ్చు
- ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి రికమెండేషన్స్ పొందవచ్చు