అమరావతి: తన మంత్రివర్గంపై చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకంగా ఉండాలన్న తన ఆశయాన్ని మంత్రులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతుండటంపై చంద్రబాబు పెరుగుతున్న అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులపై క్లాస్ తీసుకోవడం ఆయన ఆగ్రహానికి సాక్షంగా మారింది. ముఖ్యంగా, మంత్రులు కొందరు చొరవ తీసుకుని నిరంతర ఆరాటంతో పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.
తాము ఉన్నతస్థాయిలో ఉన్నామని పొగడ్తలకు ఆకర్షితులు కాకుండా, ప్రజా సేవకులుగా వాస్తవమైన అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ తరహా నియంత్రణ లేకపోవడం, ప్రసంశల మత్తులో మునిగిపోవడం టీడీపి మంత్రులకు అడ్డంకిగా మారుతోంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటేనే సంతృప్తి కలుగుతుందని చంద్రబాబు మంత్రులకు గట్టి సందేశం ఇచ్చారు.
తమ నియామక బాధ్యతలను మరింత చురుకుగా నిర్వహించి, సమగ్ర అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలి అని ఆయన సూచిస్తున్నారు.