fbpx
Saturday, November 9, 2024
HomeMovie Newsవైవాహిక జీవితంలో కొత్త అడుగు వేసిన క్రిష్

వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేసిన క్రిష్

KRISH-NEW-STEP-IN-MARRIAGE-LIFE
KRISH-NEW-STEP-IN-MARRIAGE-LIFE

మూవీడెస్క్: టాలీవుడ్‌కి వెరైటీ కాన్సెప్ట్స్‌తో ముద్ర వేసిన దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఎప్పుడూ సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘ఘాటీ’ మూవీతో బిజీగా ఉన్న క్రిష్, త్వరలోనే తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.

క్రిష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.

ఇది క్రిష్‌కు రెండో పెళ్లి, ప్రీతి వైద్య రంగంలో నాలుగో తరం వైద్యురాలు కావడం విశేషం.

ప్రీతి చల్లా హాస్పిటల్స్‌లో గైనకాలజిస్ట్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహం నవంబర్ 10న జరగనుంది.

అలాగే నవంబర్ 16న టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

క్రిష్ మొదటి వివాహం 2018లో విడాకులతో ముగిసింది. ఇప్పుడు ప్రీతి చల్లాతో జీవితం మళ్లీ కొత్త శుభారంభం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ‘ఘాటీ’ చిత్రంలో బిజీగా ఉన్న క్రిష్, ఈ సినిమా పూర్తయ్యాక మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లను అనుసరించాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular