అమెరికా: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై నాసా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల, సునీతా బలహీనంగా ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆమె ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. భారతీయ అమెరికన్ శ్యాసకోశ నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా కూడా సునీతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు.
నాసా ఈ చర్చలకు ముగింపు పలుకుతూ, ఐఎస్ఎస్‌లో ఉన్న సునీతా సహా ఇతర వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేసింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వారి ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఫ్లైట్ సర్జన్ల పర్యవేక్షణలో ఉందని, వారికి అవసరమైన పోషకాహారం అందించబడుతోందని పేర్కొంది.
తాజా సమాచారం ప్రకారం, స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ భాగంగా సునీతా 2025 ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్‌లోనే ఉండవలసి రావచ్చు. దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం వల్ల ఎముకల సాంద్రత, కండరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
సునీతా ఆరోగ్యం గురించి వచ్చిన పుకార్లపై నాసా స్పందించడం ద్వారా, వారి పట్ల ఉన్న ఆందోళనకు చెక్ పడింది.