fbpx
Friday, November 8, 2024
HomeAndhra Pradeshసోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై లక్ష్మీపార్వతి ఆగ్రహం

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై లక్ష్మీపార్వతి ఆగ్రహం

lakshmi-parvathi-condemns-chandrababu-actions

ఆంధ్రప్రదేశ్: వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే ఓ వర్గంమీడియా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపించారు.

చంద్రబాబు చేసిన పాపాలను గుర్తుచేసుకుంటూ, ఆయనకు ఎన్టీఆర్ నాడు ఎంతటి నిందలు మోపారో, ఇప్పుడు అదే పద్ధతిలో వైసీపీని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

“1993లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నన్ను అడ్డుపెట్టుకున్న విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ మీద అనేక తప్పుడు ఆరోపణలు మోపిన చంద్రబాబు, ఇప్పుడు వైసీపీని లక్ష్యంగా తీసుకుని తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ నాడు ప్రముఖ వార్త పత్రికను చెత్త బుట్టలో వేయాలని అన్న మాటలను, ఈ రోజు కూడా తాను గుర్తు చేస్తున్నానని” అన్నారు.

లక్ష్మీపార్వతి.. చంద్రబాబు, మీడియా సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చే ప్రయత్నంలో చంద్రబాబు, సంస్థ ప్రముఖులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఈ తీరును ప్రజలు గమనించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular