తెలంగాణ కేసీఆర్: రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేతలు, విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) నాయకులు కేటీఆర్, హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, ఇప్పుడు బీజేపీ కూడా తన శాయ శక్తులా దూకుడు ప్రదర్శిస్తోంది.
మూసీ నది ప్రక్షాళన, రైతులకు హామీలు, గ్యారెంటీల అమలు వంటి అంశాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ సమయంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చే అంచనాలున్నాయి.
ఇది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ ప్రముఖ నేత కేసీఆర్ రంగ ప్రవేశంతో జరగనుందని తెలుస్తోంది. మూడు నెలల సైలెన్స్ తరువాత, ఈ నెల చివరి వారంలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్‌గా మారే అవకాశం ఉంది.
తన పునరాగమనానికి పక్కా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నట్లు సమాచారం. గత బడ్జెట్ సమావేశాల అనంతరం కేసీఆర్ రాకపోవడం, బీఆర్ ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్‌రావుల దూకుడుతోనే వ్యవహారాలు నడవడం, కేసీఆర్ మౌనంగా ఉండటం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది.
ఇప్పుడు బీఆర్ ఎస్‌లో ప్రజల సానుభూతిని పెంపొందించేందుకు కేసీఆర్ ముందుకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే కాకుండా, బాధిత ప్రజలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం కూడా అందించనున్నారు.
ఈ మార్గంలో ప్రజల్లో తమ ప్రాధాన్యతను నొక్కిచెప్పాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు, తమ పక్షంలో నిలుస్తారనే నమ్మకంతో కేసీఆర్ సరికొత్త దూకుడు చూపిస్తున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.